akshay kumar: అక్షయ్ కుమార్ హీరోగా 'చంద్రముఖి' హిందీ సీక్వెల్

  • తెలుగు .. తమిళ భాషల్లో 'చంద్రముఖి' హిట్ 
  • హిందీలో 'భూల్ భూలయ్య'గా సక్సెస్ 
  • హిందీలో సీక్వెల్ దిశగా సన్నాహాలు   

విడుదలైన అన్ని భాషల్లోనూ విజయవిహారం చేసిన చిత్రాల జాబితాలో 'చంద్రముఖి' ఒకటిగా కనిపిస్తుంది. మలయాళంలో 'మణిచిత్రతాళు' పేరుతో తెరకెక్కిన సినిమా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో రజనీకాంత్ కథానాయకుడిగా ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో 'చంద్రముఖి' పేరుతో రీమేక్ చేశారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది. తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా వెంకటేశ్ హీరోగా 'నాగవల్లి' పేరుతో తెలుగులో ఓ చిత్రాన్ని చేసినప్పటికీ, అది విజయం సాధించలేకపోయింది.

ఇక కన్నడలో 'ఆప్తమిత్ర' పేరుతో రూపొందిన చంద్రముఖి అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అక్షయ్ కుమార్ హీరోగా .. 'భూల్ భులయ్య' పేరుతో హిందీలోకి ఈ సినిమాను ప్రియదర్శన్ రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా బాగానే ఆడింది. మళ్లీ ఇంతకాలానికి హిందీలో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. త్వరలో 'భూల్ భూలయ్య 2' సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News