bjp: బీజేపీకి 2014లో వచ్చినన్ని సీట్లు ఇప్పుడు రావు: కేంద్ర మంత్రి అథవాలే
- యూపీలో 10 నుంచి 15 సీట్లు కోల్పోతుంది
- మహారాష్ట్రలో ఐదు నుంచి ఆరు స్థానాలు తగ్గుతాయి
- ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీపై ప్రభావం చూపుతుంది
చివరి దశ పోలింగ్ మాత్రమే మిగిలిన సమయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన సీట్ల కంటే ఈ సారి తక్కువ వస్తాయని అన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమి వల్ల అక్కడ బీజేపీ 10 నుంచి 15 సీట్లను కోల్పోతుందని చెప్పారు.
2014లో యూపీలో మొత్తం 80 సీట్లకు గాను బీజేపీ 73 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు వేటికవే ఒంటిరిగా పోటీ చేశాయి. మహారాష్ట్రలో ఈ సారి ఐదు నుంచి ఆరు సీట్లను బీజేపీ కోల్పోతుందని అథవాలే చెప్పారు. మరోవైపు, ఈ సారి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోవచ్చని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.