Andhra Pradesh: గుంటూరులో వేడుకలు.. ‘జోహార్ చంద్రబాబు’ అని నాలుక కరచుకున్న టీడీపీ నేత!

  • జిల్లాలోని పొన్నూరు టీడీపీ ఆఫీసులో వేడుకలు
  • ముందస్తు సంబరాలు జరుపుతున్న నేతలు
  • జోహార్ అనడంతో నవ్వుల్లో మునిగిపోయిన ఇతరులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని టీడీపీ గెలుపు సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. జిల్లాలోని పొన్నూరు పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘జై టీడీపీ, జయహో చంద్రబాబు.. జయహో.. జయహో’ అని నినాదాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ నేత జోహార్ చంద్రబాబు అన్నారు.

దీంతో ఒక్కసారిగా మిగిలిన టీడీపీ నేతలు, కార్యకర్తలు బిత్తరపోయారు. వెంటనే అతడిని వారించిన మిగిలిన నేతలు నవ్వుల్లో మునిగిపోయారు. ‘జోహార్ కాదబ్బా.. జయహో అని చెప్పాలి’ అని సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి.

Andhra Pradesh
Guntur District
Telugudesam
johar
Chandrababu
slogan
laugh
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News