Andhra Pradesh: నేడు పులివెందులకు జగన్.. టూర్ వివరాలు ప్రకటించిన వైసీపీ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b24ca630ee856d5c1fc47182c28e403efadf4465.jpg)
- ఈరోజు ఇంటికి చేరుకోనున్న జగన్
- రేపు క్యాంపు ఆఫీసులో ప్రజలతో సమావేశం
- సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొననున్న నేత
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మూడ్రోజుల పర్యటనలో భాగంగా నేడు కడప జిల్లాలోని పులివెందులకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన వివరాలను వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. జగన్ ఈరోజు సాయంత్రం తన నియోజకవర్గం పులివెందులలోని ఇంటికి చేరుకుంటారని వైసీపీ నేత అవినాశ్ రెడ్డి తెలిపారు.
అనంతరం రేపు పులివెందుల పట్టణంలోని బకరాపురంలో ఉన్న తన క్యాంపు ఆఫీసులో ప్రజలను కలుసుకుంటారని చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం పులివెందులలో వీకే ఫంక్షన్ హాల్ లో ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నెల 16(ఎల్లుండి) బకరాపురంలో ప్రజలను మళ్లీ కలుసుకుంటారనీ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని అవినాశ్ రెడ్డి చెప్పారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-9c9e9bc475a55c762ee8a68f38ec3dc500b55aa8.jpg)