Andhra Pradesh: వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరణ.. కోరిక తీర్చాలని యువకుడి వేధింపులు!

  • వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
  • బాధ్యులపై చర్యలకు కుటుంబ సభ్యుల డిమాండ్
  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం, తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్రమనస్తాపానికి లోనైన బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో దోషులను శిక్షించాలంటూ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు 10 సంవత్సరాల క్రితం గుంటూరుకు చేరుకుని పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాహిత స్నానం చేస్తుండగా, ఓ యువకుడు ఫోన్ లో రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం తన కోరిక తీర్చాలనీ, లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీనికి సదరు యువకుడి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.

అయితే బయటకు చెబితే పరువు పోతుందన్న భయంతో వివాహిత ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పలేదు. నాలుగు రోజుల క్రితం సదరు యువకుడు మరోసారి వేధిస్తుండగా భర్త ఇంటికి రావడంతో విషయం బయటపడింది. ఈ వేధింపులతో మనస్తాపానికి లోనైన వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఏఎస్పీని బాధితురాలి భర్త, బంధువులు ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ వైటీ నాయుడు పోలీసులను ఆదేశించారు.

Andhra Pradesh
Guntur District
SEXUAL HARRSMENT
  • Loading...

More Telugu News