Jagan: 21 నాటికి అందరూ విజయవాడకు రండి!: పార్టీ నేతలకు జగన్ ఆదేశం

  • రేపటికి ఫర్నీచర్ తరలింపు పూర్తి
  • 16న కౌంటింగ్ ఏజంట్లకు శిక్షణ
  • అమరావతికి 10 కిలోమీటర్ల దూరంలో కార్యాలయం

కౌంటింగ్ ప్రారంభానికి రెండు రోజుల ముందుగా 21వ తేదీ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అన్ని నియోజకవర్గాల్లో నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర నేతలు విజయవాడకు రావాలని వైఎస్ జగన్ ఆదేశించినట్టు సమాచారం. అమరావతి ప్రాంతంలో నిర్మించిన కొత్త పార్టీ కార్యాలయంలో ఈ నెల 22 నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్న జగన్, ఇప్పటికే ఆ దిశగా అడుగులు ప్రారంభించారు.

 హైదరాబాద్ లోని లోటస్ పాండ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తరలింపు ప్రారంభమైంది. ఇక్కడున్న ఫర్నీచర్ ను ఉండవల్లికి చేరుస్తున్నారు. ఈ పనులు బుధవారం నాటికి పూర్తవుతాయని, ఆపై 16వ తేదీన పార్టీ కౌంటింగ్ ఏజంట్ల శిక్షణ ఉండవల్లిలోనే జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, అమరావతి ప్రాంతంలో తన నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న జగన్, ఫిబ్రవరి 27న గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే వైసీపీ అధినేత జగన్ నివాసంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం ఉంటాయి.

Jagan
YSRCP
Undavalli
Amaravati
  • Loading...

More Telugu News