hero: ఇంకొన్నేళ్లకూ నా ఉత్తమ చిత్రం ‘అదే’ అంటే నటనలో నేను ఎదగనట్టే: హీరో విజయ్ దేవరకొండ

  • ‘అర్జున్ రెడ్డి’ని మళ్లీ నేను చూస్తే సిగ్గుపడాలి
  • ఓ నటుడిగా నేను ఆ స్థాయికి ఎదగాలి
  • ప్రతి సినిమాకు నా నటన మెరుగు పడాలి 

ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో దేనికదే ప్రత్యేకం. అతను నటించిన కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’. వచ్చే నెల 26న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ.. నటనను మెరుగుపరచుకోవడం గురించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినీ కెరీర్ లో ఓ రేంజ్ లో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని కొన్నేళ్ల తర్వాత మళ్లీ తాను చూస్తే నటుడిగా తన నైపుణ్యాన్ని చూసి తాను సిగ్గుపడాలని, ఆ స్థాయికి తాను ఎదగాలని అన్నాడు.

ఇంకొన్నేళ్లు గడిచినా కూడా అర్జున్ రెడ్డే తన ఉత్తమ చిత్రం అని చెప్పుకుంటే, నటుడిగా తాను ఎదగలేదని అర్థమని అభిప్రాయపడ్డాడు. ప్రతి సినిమాకు తన నటన మెరుగు పడాలన్నదే తన ఉద్దేశమని చెప్పాడు. ‘డియర్ కామ్రేడ్’ గురించి చెబుతూ, తన అభిమానులు చాలా రోజులుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని, వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉంటుందని చెప్పాడు.

hero
vijaya devarakonda
arjun reddy
comrade
  • Loading...

More Telugu News