Srikakulam: నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళల మృతి

  • ఆటో నడుపుతూ జీవిస్తున్న సీతారాం
  • బట్టలు ఉతికేందుకు నదికి వెళ్లిన మహిళలు
  • ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు నదిలో మునిగి మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో జరిగింది. ఈ ఘటనతో బిర్లంగి గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆటో నడుపుతూ జీవనం సాగించే దూపాన సీతారాం భార్య ఢిల్లమ్మ(35), కుమార్తె గాయత్రి(12), తమ్ముడి భార్య కమల(32), తమ్ముడి కుమార్తె(11) కలిసి బట్టలు ఉతికేందుకు స్థానిక బాహుదా నదికి వెళ్లారు.

అయితే వారంతా ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Srikakulam
Dhillamma
Gayathri
Kamala
Bahuda River
Seetha Ram
  • Loading...

More Telugu News