West Godavari District: భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల దాడి

  • స్థానిక ఎస్వీఆర్ టవర్స్ లో బెట్టింగ్ నిర్వహణ
  • ముఠా సభ్యులు నలుగురు అరెస్టు
  •  నిందితుల నుంచి టీవీ, సెల్ ఫోన్స్ స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. స్థానిక ఎస్వీఆర్ టవర్స్ లో ఈ ముఠా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ముఠా సభ్యులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి లైన్ బాక్స్, టీవీ, సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.  

ఇదిలా ఉండగా, విశాఖపట్టణంలో దారిదోపిడీకి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కంచరపాలెం, గోపాలపట్నంలో వీరు దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి లక్షా అరవై వేల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు విమానాశ్రయంలోని పీఎస్ నేర విభాగం పోలీసులు తెలిపారు.

West Godavari District
bhimavaram
Cricket
betting
  • Loading...

More Telugu News