Irome Sharmila: మాతృదినోత్సవం నాడే ఇద్దరు ఆడ కవలలకు జన్మనిచ్చిన ఇరోమ్ షర్మిల

  • తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు 
  • షర్మిలకు తగినంత విశ్రాంతి కావాలన్న డాక్టర్లు 
  • కుమార్తెలకు అప్పుడే పేర్లు పెట్టిన షర్మిల

మానవ హక్కుల కార్యకర్త, రాజకీయ నేత ఇరోమ్ షర్మిల మాత‌ృదినోత్సవం నాడే ఇద్దరు ఆడ కవలలకు జన్మనిచ్చారు. ఆదివారం ఆమె ప్రసవించినట్టు బెంగుళూరులోని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఆమెకు తగినంత విశ్రాంతి కావాలని, మీడియాతో మాట్లాడేందుకు కుదరదని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కి చెందిన వైద్యుడు డాక్టర్ శ్రీప్రద వినేకర్ తెలిపారు. అయితే షర్మిల అప్పుడే తన కుమార్తెలకు పేర్లను కూడా పెట్టారు. అవుటమ్ తారా, నిక్స్ శశి అని కవలలిద్దరికీ పేర్లు పెట్టినట్టు షర్మిల సన్నిహితులు మీడియాకు తెలిపారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News