Bill Collectors: జూన్ 5 వరకూ మేము బయట తిరగలేం.. పని చేయలేం: బల్దియా ఉద్యోగులు

  • టాక్స్ వసూలు చేయాలని కమిషనర్ ఆదేశం
  • ఎండలు తీవ్రంగా ఉన్నాయన్న ఉద్యోగులు
  • ఇంత ఎండలో పనిచేయలేమన్న సిబ్బంది  

ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పని వున్నా పగటి వేళ బయటకు వెళ్లడానికి అంతా జంకుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తాము బయటకు వెళ్లే సమస్యే లేదని చెప్పేస్తున్నారు హైదరాబాద్ నగరపాలక సంస్థ ఉద్యోగులు. నగరంలోని వివిధ భవనాలు, షాపులకు టాక్స్ వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లను ఇటీవల ఆదేశించారు. అయితే, ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తాము పనిచేయలేమంటూ బల్దియా ఉద్యోగులు మూకుమ్మడిగా కమిషనర్‌కు మొర పెట్టుకున్నారు. జూన్ 5వ తేదీ వరకూ తాము బయట తిరిగి పని చేయలేమని వాపోయారు. మరి దీనిపై కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Bill Collectors
Tax Inspectors
GHMC Commissioner
Employees
Hyderabad
  • Loading...

More Telugu News