Telangana: చెన్నైలో స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ

  • ఆళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసంలో భేటీ
  • కేసీఆర్ ను సాదరంగా ఆహ్వానించిన స్టాలిన్
  • దేశ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ

డీఎంకే అధినేత స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. చెన్నై ఆళ్వార్ పేటలో స్టాలిన్ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ ను సాదరంగా స్టాలిన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై స్టాలిన్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ భేటీలో టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్, డీఎంకే సీనియర్ నేతలు దురైమురుగన్, టీఆర్. బాలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు, తమిళనాడు పర్యటనలో భాగంగా కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీరంగం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత తిరుచ్చి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం, చెన్నై చేరుకున్నారు.

  • Loading...

More Telugu News