Chandrababu: రేపు విడుదలయ్యే టెన్త్ ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా వారిని నిందించవద్దు: చంద్రబాబు

  • ఏపీలో మంగళవారం పదో తరగతి ఫలితాల వెల్లడి
  • విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు వినతి
  • ఇతర పిల్లల ఫలితాలతో పోల్చి మీ పిల్లల్ని కించపరచవద్దంటూ విజ్ఞప్తి

రేపు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. మంగళవారం విడుదల కానున్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా వారికి మీ అండ అవసరం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మార్కులు తక్కువ వచ్చాయని వారిని పొరబాటున కూడా నిందించవద్దని, ఇతర పిల్లలతో పోల్చి అవమానకరంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు.

మార్కులు సరిగా రాని పిల్లలను దూషించడం ద్వారా వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు పిల్లల తెలివితేటలకు కొలమానాలు కాదని, కిందపడినా రెట్టించిన ఉత్సాహంతో పైకిలేచే కడలి అలలను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్లీ ప్రయత్నం చేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చంటూ పిల్లల్లో ప్రేరణ కలిగించాలని తల్లిదండ్రులకు సూచించారు. మార్కులు సరిగారాని పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News