shivashankar master: సినిమాల్లో అవకాశాలు రావడం లేదే అనే బాధతో నేను చనిపోకూడదు: శివశంకర్ మాస్టర్

  • సలీమ్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశాను
  • తమిళ సినిమాతో కెరియర్ మొదలైంది 
  • కొత్తదనాన్ని అందించడానికే ప్రయత్నిస్తుంటాను

వివిధ భాషల్లో నృత్య దర్శకుడిగా శివశంకర్ మాస్టర్ అనేక చిత్రాలకు పనిచేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "నృత్య దర్శకుడు సలీమ్ గారి దగ్గర నేను అసిస్టెంట్ గా చేరాను. ఒక ఏడాదిపాటు ఆయనతో షూటింగ్స్ కి వెళుతూ, అన్ని విషయాలను దగ్గరగా పరిశీలించేవాడిని. ఆ తరువాత ఒక తమిళ చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యాను.

ఇండస్ట్రీలో 46 ఏళ్లుగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఎంతకాలం ఇండస్ట్రీలో వున్నాను అనేది కాదు .. ఏం సాధించామనే విషయమే సంతృప్తిని కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తూ వెళ్లాలనే ఉద్దేశంతో ఉంటాను. బతికున్నంత వరకూ సినిమాలకి పనిచేస్తూ వుండాలి. సినిమాలకి పనిచేస్తున్నంతవరకూ బతికుండాలి .. అవకాశాలు రావడం లేదే అనే బాధతో చనిపోకూడదు" అంటూ చిత్రపరిశ్రమ పట్ల తనకి గల ప్రేమను .. అంకితభావాన్ని చాటుకున్నారు. 

  • Loading...

More Telugu News