ajay bhupathi: 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడితో రవితేజ

  • హిట్స్ కి దూరంగా రవితేజ
  •  అజయ్ భూపతికి గ్రీన్ సిగ్నల్
  • కథపై  జరుగుతోన్న కసరత్తు

వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రాల జాబితాలో ఇటీవల వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' చేరిపోయింది. కుర్రకారు మనసులను ఈ సినిమా బాగా పట్టేసింది. దర్శకుడు అజయ్ భూపతికి ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి తదుపరి సినిమా పేరుగా 'మహాసముద్రం' వినిపించింది. చైతూ కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనున్నట్టు వార్తలు వచ్చాయి.

 చైతూ మార్కెట్ కి మించి బడ్జెట్ వున్న కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదనేది తాజా సమాచారం. దాంతో తనతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతోన్న రవితేజ కోసం అజయ్ భూపతి మంచి మాస్ మసాలా కథని సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. కొంత కాలంగా హిట్ అనే మాటకు దూరంగా వుండిపోయిన రవితేజ, అజయ్ భూపతి టాలెంట్ ను గుర్తించి అవకాశమిచ్చాడని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి మరి. 

ajay bhupathi
raviteja
  • Loading...

More Telugu News