komaram: మంచి భోజనం కోసం వారం రోజులు ఎదురుచూస్తే చివరికి అలా జరిగింది: 'జబర్దస్త్' కొమరం
- మాది చాలా పేద కుటుంబం
- చదువు ఆపేయడానికి అదే కారణం
- ఏదైనా ప్రాప్తం ఉంటేనే దక్కుతుంది
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న 'కొమరం' .. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏదైనా సరే రాసి పెట్టి వుండాలంటూ ఒక విషయాన్ని గురించి చెప్పుకొచ్చాడు. "కొంతకాలం క్రితం మా ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. చదువు మానేసి మేమందరం పనులకు వెళ్లడానికి కారణం, ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోవడమే. అలాంటి పరిస్థితుల్లో చికెన్ వండి పెట్టమని వారం రోజులుగా మా అమ్మని ఏడిపిస్తున్నాను.
'బియ్యం తెచ్చుకోవడానికే డబ్బుల్లేవంటే .. చికెన్ ఎక్కడి నుంచి వస్తుందిరా' అని అమ్మ అనేది. వారం రోజుల తరువాత చికెన్ తెచ్చి వండింది. ఆమె ఎప్పుడు రెడీ చేస్తుందా? అని మా అన్నయ్య .. నేను .. మా చెల్లి ఆత్రంగా ఎదురుచూస్తున్నాము. అందరం తలా కాస్త చికెన్ పెట్టుకుని తిందామని అనుకుంటూ ఉండగా, మా బావకి యాక్సిడెంట్ అయిందనే కబురు వచ్చింది. అంతే.. అక్కడే చికెన్ ప్లేట్లు వదిలేసి పరిగెత్తాము. ప్రాప్తం లేకపోవడమంటే ఇదే" అని అన్నాడు.