Telangana: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల... జగిత్యాల టాప్, హైదరాబాద్ లాస్ట్!
- ఫలితాలు విడుదల చేసిన జనార్దన్ రెడ్డి
- 92.43 శాతం ఉత్తీర్ణత
- జగిత్యాల జిల్లాలో 99.30 శాతం ఉత్తీర్ణత
మార్చి నెలలో నిర్వహించిన తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను కొద్దిసేపటి క్రితం సచివాలయంలోని డీ- బ్లాక్ మీటింగ్ హాల్ లో విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. టెన్త్ పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకాగా, 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయన అన్నారు. ఎప్పటిలానే బాలికలు ముందు నిలిచారని, పరీక్షలు రాసిన బాలికల్లో 93.68 శాతం, బాలురలో 91.18 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.
ఇక జగిత్యాల జిల్లాలో పరీక్షలు రాసిన వారిలో 99.30 శాతం మంది పాస్ కాగా, 89.09 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇక వచ్చే నెల 10 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈ నెల 27వ తేదీలోగా పరీక్ష రుసుం చెల్లించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు.