Ninet Prabhu: చిన్నతనంలో అమ్మ దగ్గరికెళ్లి నా కోసం ప్రార్థించమని అడిగేదాన్ని: సమంత

  • మా అమ్మ ప్రార్థనల్లో మ్యాజిక్ ఉంటుంది
  • అమ్మ నా కోసం  ప్రార్థించు అని అడిగేదాన్ని
  • ఆమె కోరితే అన్నీ జరుగుతాయని నమ్మకం

అగ్ర కథానాయిక సమంత తన తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన తల్లి నినెట్ ప్రభు ఔన్నత్యాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ‘మా అమ్మ ప్రార్థనల్లో మ్యాజిక్‌ ఉంటుందని నా గట్టి నమ్మకం. చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్లి.. ‘అమ్మ నా కోసం ప్రార్థించు’ అని అడిగేదాన్ని. ఇప్పటికీ నేను ఆమె దగ్గరికి అలానే వెళ్తుంటా. ఆమె కోరుకుంటే అన్నీ జరుగుతాయని నా నమ్మకం. మా అమ్మలోని మరో ఉత్తమమైన గుణం ఏంటంటే, ఆమె ఏ రోజూ తన కోసం తను ప్రార్థించలేదు. దేవుడి తర్వాత అమ్మే. లవ్‌ యు అమ్మా’ అని సమంత పోస్ట్ పెట్టింది.

Ninet Prabhu
Samantha
Social Media
Post
Prayer
  • Loading...

More Telugu News