TRS: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్

  • రంగారెడ్డి అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి
  • నల్గొండ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి
  • వరంగల్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి

టీఆర్ఎస్ తన ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉండటంతో ఆ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డిని ఖరారు చేసిన అధిష్ఠానం, నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఖరారు చేసింది. అభ్యర్థుల ఖరారు అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. రేపు డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఆయన ఫెడరల్ ఫ్రంట్ విషయమై భేటీ కానున్నారు.

TRS
KCR
MLC
Patnam Mahender Reddy
Thera Chinnapa Reddy
Pochampally Srinivasa Reddy
  • Loading...

More Telugu News