Kurnool: 16 మంది చనిపోయినా కేసీఆర్ స్పందించలేదు: డీకే అరుణ ఫైర్

  • మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
  • కోడ్ పేరుతో తప్పించుకునే యత్నాలొద్దు
  • అధికారులతో ప్రకటన ఇప్పించాలి

కర్నూలు జిల్లా వెల్దుర్తి ఘటనలో 16 మంది మృతి చెందారు. వీరిలో 15 మంది తెలంగాణలోని ఒకే గ్రామానికి చెందినవారు. నేడు మృతుల కుటుంబాలను బీజేపీ నేత డీకే అరుణ పరామర్శించారు. 16 మంది చనిపోయినా కేసీఆర్ ఇంతవరకూ స్పందించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎక్స్‌గ్రేషియా విషయమై కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయకుండా, అధికారులతో ఎక్స్‌గ్రేషియాపై ప్రకటన ఇప్పించాలని అరుణ డిమాండ్ చేశారు.

Kurnool
Veldurthi
BJP
DK Aruna
KCR
Election Code
  • Loading...

More Telugu News