YSRCP: ఇక, లోటస్ పాండ్ లో ఏసీ వేసుకుని జగన్ రెస్ట్ తీసుకోవాల్సిందే: బుద్ధా వెంకన్న

  • జగన్ భ్రమల్లో బతుకుతున్నారు
  • ఏపీ ప్రజలు ఏప్రిల్ 11 నాడే ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారు
  • ఆ విషయం ఈ నెల 23న తెలుస్తుంది

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. కౌంటింగ్ రోజు ఏవో అల్లర్లు జరగుతాయని, వాటిని అరికట్టేందుకు తమ నాయకులు సిద్ధంగా ఉండాలంటూ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఈ ఎన్నికల్లోనే కాదు, గత ఎన్నికల్లో కూడా జగన్ తమ ప్రభుత్వం వస్తుందని చెప్పుకున్నారని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తోక ముడిచిన చరిత్ర జగన్ ది అని విమర్శించారు.

ఏపీ ప్రజలు ఏప్రిల్ 11 నాడే ఫ్యాన్ రెక్కలను విరగ్గొట్టారని, ఆ విషయం ఈ నెల 23న తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, లోటస్ పాండ్ లో ఏసీ వేసుకుని జగన్ రెస్ట్ తీసుకోవాల్సిందేనని సెటైర్లు విసిరారు. జగన్ కు ముఖ్య అనుచరుడు అయిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కనిపించడం తప్ప, ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.

YSRCP
jagan
Telugudesam
buddha venkanna
vijayasai
  • Loading...

More Telugu News