KCR: ప్రత్యేక విమానంలో చెన్నైకు కేసీఆర్.. రేపు స్టాలిన్‌తో భేటీ

  • కేరళ, తమిళనాడులో పర్యటించిన కేసీఆర్
  • కేసీఆర్ వెళ్లిన సమయంలో స్టాలిన్ బిజీ
  • నేడు శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకోనున్న కేసీఆర్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఆయన ఇప్పటికే కేరళ, తమిళనాడులో పర్యటించగా నేడు మరోసారి తమిళనాడు వెళ్లారు. ఇంతకు ముందు తమిళనాడు వెళ్లినప్పుడు ఆయన డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలవలేకపోయారు.

అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో కేసీఆర్‌తో భేటీ ఆయనకు సాధ్యం కాలేదని డీఎంకే వర్గాలు తెలిపాయి. దీంతో నేటి సాయంత్రం ప్రత్యేక విమానంలో కేసీఆర్ చెన్నైకి బయలు దేరారు. ఈ రోజే శ్రీరంగం ఆలయాన్ని కూడా ఆయన దర్శించుకోనున్నారు. రేపు కేసీఆర్ స్టాలిన్‌తో భేటీ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

KCR
Tamilnadu
Stalin
Kerala
Federal Front
Srirangam
  • Loading...

More Telugu News