Uttar Pradesh: యూపీలో బీజేపీ జెండాను బూట్లుగా వేసుకున్న వ్యక్తి.. చితకబాదిన బీజేపీ కార్యకర్తలు!

  • జౌన్పూర్ జిల్లాలోని షాగంజ్ లో ఘటన
  • పోలింగ్ సందర్భంగా బీజేపీ బూట్లతో రాక
  • లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ లో ఈరోజు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. జౌన్పూర్ జిల్లాలోని షాగంజ్ గ్రామంలో ఈరోజు పోలింగ్ సందర్భంగా ఓ వ్యక్తి బీజేపీ జెండాలను బూట్లలాగా కాళ్లకు చుట్టుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దీంతో అతడిని చూసిన బీజేపీ కార్యకర్తలకు కోపం నషాళానికి అంటింది. వెంటనే అతడిని పట్టుకుని చితకబాదారు. అయితే పోలింగ్ కేంద్రం పరిధిలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీచార్జ్ చేసిన అనంతరం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.

Uttar Pradesh
BJP
shoe of flags
attacked
Police
  • Loading...

More Telugu News