Mandalay: ముందు టైరు తెరుచుకోకపోయినా అద్భుత నైపుణ్యంతో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్... 89 మంది సేఫ్

  • మయన్మార్ మాండలే ఎయిర్ పోర్టులో ఘటన
  • విమానం ముందు భాగం రోడ్డుకు తాకిన వైనం
  • పైలట్ నేర్పరితనంతో తప్పిన  ప్రమాదం

మయన్మార్ లో ఇవాళ ఘోర విమాన ప్రమాదం తప్పింది. యాంగూన్ లోని మాండలే విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ముందు టైరు తెరుచుకోలేదు. దాంతో విమాన పైలెట్ ఎంతో నైపుణ్యంతో విమానాన్ని కిందికి దించిన వైనం అందరిని ఊపిరి బిగబట్టేలా చేసింది. ముందు టైరు లేకుండా ల్యాండింగ్ అంటే ఏమాత్రం తేడా వచ్చినా విమానం ముందు భాగం రన్ వేకు బలంగా గుద్దుకుని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి.

అయితే ఈ పైలెట్ మాత్రం ల్యాండింగ్ గేర్ విఫలమైనా, కేవలం వెనుక టైర్ల సాయంతో విమానాన్ని ఎంతో నేర్పుగా కిందికి దించాడు. ఈ క్రమంలో విమానం ముందు భాగం నేలకు గుద్దుకున్నా అప్పటికే ఫ్లయిట్ పూర్తిగా ల్యాండైంది. పైలట్ సమయస్ఫూర్తి కారణంగా విమానంలో ఉన్న ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదు. ఈ సమయంలో విమానంలో ఏడుగురు సిబ్బంది, 82 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ యూబీ-103 విమానం మయన్మార్ ఎయిర్ లైన్స్ కు చెందినది.

  • Loading...

More Telugu News