Maharshi: వెన్నెల గురించి, మహేశ్ బాబు అందం గురించి మాట్లాడుతూనే ఉంటాం: ప్రముఖ యాంకర్ సుమ

  • ‘నోవాటెల్’లో ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్
  • మహేశ్ అందం పెరుగుతుంది.. అహం మాత్రం పెరగదు
  • ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ లో సుమ

‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈరోజు నిర్వహించారు. చందమామ వెన్నెల గురించి మహేశ్ బాబు అందం గురించి మనం చెబుతూనే ఉంటామని ప్రముఖ యాంకర్ సుమ ప్రశంసించారు. మహేశ్ అందం గురించి రాజకుమారుడు సినిమా నుంచి ఇప్పటి వరకూ చెబుతూనే ఉన్నామని అన్నారు. దేవుడు కొంతమందికి అన్నీ కరెక్టు కొలమానాల్లో ఇస్తారని, కొంత మందికి అందం ఇచ్చి బుర్ర సరిగ్గా ఇవ్వరు కానీ, మహేశ్ బాబుకు అందం, బుర్ర ఇచ్చాడని, ఆయన అందం పెరుగుతుంది, అహం మాత్రం పెరగదని సుమ కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మహేశ్ బాబు.. సుమకు థ్యాంక్స్ చెబుతున్నానని, ఆమెను సక్సెస్ మీట్ కు వ్యాఖ్యాతగా రావాలని అడగగానే వచ్చినందుకు సంతోషమని అన్నారు. ఆమె వస్తే తనకు ఓ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుందని, ఫంక్షన్ కే ఓ కళ వస్తుందంటూ మహేశ్ వ్యాఖ్యానించారు.

Maharshi
movi
anchor
suma
mahesh babu
  • Loading...

More Telugu News