Andhra Pradesh: ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందన్న ప్రశ్నకు నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఏపీలో ఏ పార్టీ గెలవబోతోందో అక్కడి ప్రజలకు తెలుసు
  • ఏ పార్టీపై విశ్వాసం ఉందో నా నోటితో చెప్పను
  • గుంటూరులో కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువ 

ఏపీలో ఏ పార్టీ గెలవబతోందన్న ప్రశ్నకు బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఏపీలో ఏ పార్టీ గెలవబోతోందో అక్కడి ప్రజలకు తెలుసని అన్నారు. ఏపీలో ఏ పార్టీ హవా వీస్తోందో, ఏ పార్టీపై విశ్వాసం ఉందో తన నోటితో చెప్పనని ప్రజలకు తెలుసని అన్నారు. ఒకోసారి కొన్ని ఈక్వేషన్స్ మారుతుంటాయని, ఈ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం ఉండటం బాగా గమనించానని చెప్పారు. ఎప్పుడైతే, కులం, డబ్బు కు లొంగిపోకుండా ఉంటామో అప్పుడే నిజమైన నాయకుడిని ఎన్నుకోగల్గుతామని అన్నారు.

తెలుగు వాళ్లు డబ్బుల కోసం ఓట్లు వేస్తారని దేశ, విదేశాల్లో చెప్పుకుంటున్నారని, మన పరువు మనమే తీసుకునే స్థాయికి దిగజారుతున్నామని అన్నారు. గుంటూరులో అయితే కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువని, ఇంకా, నిజాయతీ గల నాయకులు ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుని ఉంటే, వారు ఎటు వైపు మొగ్గు చూపారో వాళ్లే సీఎం అవుతారని చెప్పారు.

Andhra Pradesh
BJP
madhavi latha
guntur
  • Loading...

More Telugu News