Andhra Pradesh: నాన్న బిజీగా ఉంటే మా అమ్మ కుటుంబం, వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించింది!: నారా లోకేశ్

  • అమ్మ ఏలుబడిలో కుటుంబం సురక్షితంగా ఉంటుంది
  • తల్లి పాలనాసామర్థ్యం అమోఘం
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

కుటుంబం అనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో, సంరక్షణలో సురక్షితంగా ఉంటుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తల్లి పాలనాసామర్థ్యం అమోఘమని కితాబిచ్చారు. ‘మా నాన్న ప్రజాసేవలో తీరిక లేకుండా ఉంటే, మా అమ్మ అటు ఇంటి బాధ్యతలను, ఇటు వ్యాపార నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించింది’ అని ప్రశంసించారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ లోకేశ్ శుభకాంక్షాలు తెలిపారు.

ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘కుటుంబమనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో, సంరక్షణలో సురక్షితంగా ఉంటుంది. ఆమె పాలనాసామర్థ్యాలు అమోఘమైనవి. నాన్న ప్రజాసేవలో తీరికలేకుండా ఉంటే ఇటు ఇంటి బాధ్యతలను, అటు వ్యాపార నిర్వహణను మా అమ్మే సమర్థవంతంగా నిర్వర్తించింది.  #MothersDay సందర్భంగా అమ్మలందరికీ పాదాభివందనాలు’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Nara Lokesh
Twitter
mothers day
  • Loading...

More Telugu News