Hyderabad: మద్యం అనుకుని యాసిడ్ తాగి మృతి చెందిన మింట్ ఉద్యోగి

  • ఫుల్లుగా తాగి ఇంటికొచ్చి యాసిడ్ తాగిన ఉద్యోగి
  • ఈ నెల 9న ఘటన
  • చికిత్స పొందుతూ మృతి

మద్యం అనుకుని యాసిడ్ తాగిన హైదరాబాద్ మింట్ కాంపౌండ్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. బోయిన్‌పల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. న్యూబోయిన్‌పల్లి, చిన్నతోకట్ట ప్రాంతానికి చెందిన గణేశ్ (36) మింట్ కాంపౌండ్‌లో నాలుగో తరగతి ఉద్యోగి. ఈ నెల 9న ఫుల్లుగా మద్యం తాగి ఇంటికొచ్చిన గణేశ్ ఇంట్లోని యాసిడ్ సీసాను మద్యం బాటిల్‌గా భావించి గటగటా తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేశ్ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
liquor
mint compound
Telangana
  • Loading...

More Telugu News