New Delhi: ఓటేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ, మాజీ క్రికెటర్ గంభీర్

  • ఢిల్లీలో ఓటేసిన క్రికెటర్ గంభీర్, అతిషి, అర్వింద్ సింగ్
  • గురుగ్రామ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కోహ్లీ
  • జోరుగా కొనసాగుతున్న ఓటింగ్

ఈ ఉదయం ప్రారంభమైన ఆరో విడత ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. మొత్తం 59 నియోజకవర్గాల పరిధిలో 979 మంది అభ్యర్థులు ఈ విడత ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పలువురు కేంద్రమంత్రులు, క్రీడాకారులు కూడా ఈ విడత ఎన్నికల్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇప్పటికే పలువురు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ప్రత్యర్థులు.. ఆప్ నేత అతిషి, కాంగ్రెస్ అభ్యర్థి అర్వింద్ సింగ్ లవ్‌లీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురుగ్రామ్‌లోని పైన్‌క్రెస్ట్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశాడు. మధ్యప్రదేశ్ భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

New Delhi
Gambhir
Virat Kohli
Atishi
Sadhvi pragya
  • Error fetching data: Network response was not ok

More Telugu News