Andhra Pradesh: పెద్దలకు తెలియకుండా పెళ్లి.. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక నెలల్లోనే ఆత్మహత్య

  • పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టిన జంట
  • ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
  • పెళ్లి చేసుకుని ఏడాది కూడా తిరక్కుండానే ఉసురు తీసుకున్న జంట

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఆర్థిక ఇబ్బందులకు తాళలేక నెలల్లోనే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో జరిగింది. పట్టణానికి చెందిన తురంగి జగదీష్‌(19) డిగ్రీ చదువుతున్నాడు. ఇంటర్‌లో ఉండగా సీటీఆర్‌ఐకి చెందిన కోట దీప్తి(18)ని ప్రేమించాడు. విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమను నిరాకరించారు.

దీంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని ధవళేశ్వరం కొత్తపేటలో కాపురం పెట్టారు. పెళ్లి తరువాత జగదీశ్ స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనికి కుదిరాడు. రెండు నెలలు చేసి మానేశాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఆరు నెలలు అప్పులతో నెట్టుకొచ్చారు. అయితే, అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు రావడంతో తట్టుకోలేక జగదీశ్-దీప్తిలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

Andhra Pradesh
Rajamahendravaram
Lovers
suicide
  • Loading...

More Telugu News