Hyderabad: హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం.. నారాయణ కాలేజీ గోడ కూలి విద్యార్థి మృతి
- రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనూ భారీ వర్షం
- జలమయమైన లోతట్టు ప్రాంతాలు
- రాత్రంతా కురుస్తూనే ఉన్న వాన
శనివారం రాత్రి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. డ్రేనేజీలు పొంగిపొర్లాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. రోడ్లపైకి నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని లింగంపల్లి, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్, కోఠి, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మాదాపూర్, బంజారాహిల్స్, మెహదీపట్నంలో రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది.
రంగారెడ్డి జిల్లాలోని మెయినాబాద్, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్, కాటేదాన్, శివరాంపల్లి ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. ఘట్కేసర్‌లోనూ రాత్రంతా వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. అన్నోజిగూడ నారాయణ కాలేజీలో గోడ కూలడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.