New Delhi: రేపు దేశవ్యాప్తంగా ఆరో విడత పోలింగ్

  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ
  • 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు
  • ఢిల్లీలో 7 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ ఉంటుంది.

ఈ విడతలో ఢిల్లీలోని మొత్తం ఏడు నియోజకవర్గాలు పోలింగ్ కు సిద్ధమయ్యాయి. ఈ ఏడు స్థానాలను గత ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేసింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని కాషాయదళం కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీజేపీ ఫైర్ బ్రాండ్ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్ సింగ్ తదితరులు ఆరో విడత ఎన్నికల్లో పోటీపడుతున్నారు.

  • Loading...

More Telugu News