Mamatha Benerji: మోదీని కొడతానని నేను చెప్పలేదు.. ఆ దెబ్బ రుచి చూపిస్తానని మాత్రమే చెప్పా: మమతా బెనర్జీ

  • మిమ్మల్ని నేనెందుకు కొడతాను?
  • కొడితే నా చేయి విరిగిపోతుంది
  • ఆ పని నేనెందుకు చేయాలి?

ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీకి రాముడు గుర్తొస్తాడని, రాముడిని ఎన్నికల ఏజెంటుగా చెయ్యడం బీజేపీకి అలవాటని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని బషిర్హాట్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, మోదీని కొడతానన్నానని బీజేపీ నేతలు తనపై చేస్తున్న ప్రచారానికి దీటైన జవాబిచ్చారు.

తాను మోదీని కొడతాననలేదని, ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానని మాత్రమే అన్నానని మమత పేర్కొన్నారు. ‘‘మిమ్మల్ని నేనెందుకు కొడతాను? ఒకవేళ కొడితే నా చేయి విరిగిపోతుంది. ఆ పని నేనెందుకు చేయాలి? మీది 56 అంగుళాల ఛాతి. మిమ్మల్ని నేనెలా కొట్టగలను? మిమ్మల్ని కొట్టాలని కానీ కనీసం ముట్టుకునే ఉద్దేశం కానీ నాకు లేదు' అని మోదీని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు.

Mamatha Benerji
Narendra Modi
Rama
West Bengal
BJP
  • Loading...

More Telugu News