Andhra Pradesh: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తినడానికి వైసీపీయే కారణం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • వైసీపీ వ్యాఖ్యలు అర్థ రహితం
  • మోదీ పైసా ఇవ్వకున్నా నిలదీయలేదు
  • కులాల ప్రస్తావన మంచిది కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తినడానికి వైసీపీయే కారణమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయమై వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని, రూ.3 లక్షల కోట్ల లోటులో ఉందంటూ వైసీపీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.

ప్రధాని మోదీ రాష్ట్రానికి నయా పైసా ఇవ్వకపోయినా వైసీపీ ఏనాడూ ఆ పార్టీని నిలదీయలేదని విమర్శించారు. ఆర్థిక అంశాలపై కనీస అవగాహన లేకుండా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు. విజయసాయిరెడ్డి ఓ బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ కులాల ప్రస్తావన తీసుకురావడం మంచి పరిణామం కాదన్నారు. కేంద్రం సహకరించకపోవడం వల్లే ఏపీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని అశోక్ బాబు విమర్శించారు.

Andhra Pradesh
Ashok Babu
Srikanth Reddy
Vijayasai Reddy
Narendra Modi
  • Loading...

More Telugu News