V. Hanumantha Rao: వీహెచ్, నగేశ్ ఘర్షణపై పీసీసీ సీరియస్.. అత్యవసర సమావేశం ఏర్పాటు!

  • గీత దాటితే కఠిన చర్యలు తప్పవు
  • షోకాజ్ నోటీసులు జారీ
  • పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం

ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం నిర్వహించిన ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, నగేశ్‌కు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. కాంగ్రెస్ శ్రేణులు ఎవరైనా గీత దాటితే కఠిన చర్యలుంటాయని పీసీసీ హెచ్చరించింది.

ఘటనను సీరియస్‌గా తీసుకున్న పీసీసీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో చర్చించిన అనంతరం కమిటీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నగేశ్‌కు వీహెచ్‌పై గొడవకు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.

V. Hanumantha Rao
Nagesh
PCC
Show Cause Notice
Inter Board
  • Loading...

More Telugu News