Rajadhani Express: ఢిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు

  • ఖండపడలో చోటు చేసుకున్న ప్రమాదం
  • జనరల్ బోగిలో చెలరేగిన మంటలు
  • ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం

ఢిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఖంటపడ రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేటి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రైలు చివరి పెట్టె అయిన జనరేటర్ బోగిలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను గుర్తించిన సిబ్బంది వెంటనే బోగీని వేరు చేసి మంటలను అదుపులోకి తెచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News