Andhra Pradesh: ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్!

  • ఈరోజు నంద్యాలకు చేరుకున్న జనసేనాని
  • ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన నేత
  • కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకున్నారు. గత నెల 30న అనారోగ్యంతో కన్నుమూసిన జనసేన నేత ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తొలుత ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ‘మీరంతా ధైర్యంగా ఉండండి. జనసేన మీకు అండగా ఉంటుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల, ఆమె భర్తతో పవన్ కాసేపు మాట్లాడారు.

Andhra Pradesh
Kurnool District
Pawan Kalyan
Jana Sena
spy reddy
  • Loading...

More Telugu News