Narendra Modi: మోదీపై టైమ్ మ్యాగజైన్ లో కథనం రాసిన జర్నలిస్టుకు కాషాయ సెగ

  • ఆతిష్ తసీర్ వికీపీడియా పేజీ మార్చివేత
  • కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజర్ అంటూ సెటైర్
  • టైమ్ మ్యాగజైన్ విశ్వసనీయత కోల్పోయిందంటూ విమర్శలు

గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖచిత్రం ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించినప్పుడు పొంగిపోయిన బీజేపీ శ్రేణులు, మరోసారి ఆయన ముఖచిత్రంతో టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక వచ్చిన నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. వాళ్ల కోపానికి కారణం, తాజా సంచికలో మోదీపై విమర్శనాత్మక కథనం రావడమే.

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆతిష్ తసీర్ 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' పేరిట మోదీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ రాసిన కథనం కమలనాథుల్లో కలకలం సృష్టించింది. దాంతో, ప్రతీకార చర్యలకు దిగిన కొందరు వ్యక్తులు వికీపీడియాలో ఆతిష్ తసీర్ పేరిట ఉన్న పేజీలో సమాచారాన్ని మార్చివేశారు. ఆతిష్ తసీర్ టైమ్ మ్యాగజైన్ తో పాటు పలు అంతర్జాతీయ పత్రికలకు ఫ్రీలాన్స్ పాత్రికేయుడిగా పనిచేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజర్ గా కూడా వ్యహరిస్తున్నారంటూ సెటైర్ వేస్తూ తప్పుడు సమాచారం జోడించారు.

అంతేకాదు, టైమ్ మ్యాగజైన్ పైనా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిష్పాక్షిక కథనాలకు పెట్టింది పేరు అనే గుర్తింపు ఉన్న టైమ్ మ్యాగజైన్ ఇప్పుడా గుర్తింపును కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. గతంలో మోదీ ముఖచిత్రంతో 'వై మోదీ మ్యాటర్స్' అంటూ మోదీ గొప్పదనాన్ని కీర్తిస్తూ 2015లో టైమ్ మ్యాగజైన్ లో కథనం వచ్చినప్పుడు ఇలాంటి మ్యాగజైన్ ప్రపంచంలోనే లేదంటూ బీజేపీ వర్గాలు కీర్తించాయి. కానీ, నాలుగేళ్లలో పరిస్థితి మారిపోయిందనడానికి టైమ్ మ్యాగజైన్ తాజా సంచికే నిదర్శనం.

  • Loading...

More Telugu News