Narendra Modi: మోదీపై వ్యాఖ్యల ఫలితం... సిద్ధూకు మరోసారి నోటీసులు పంపిన ఈసీ

  • భోపాల్ సభలో సిద్ధూ విమర్శలు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
  • గతంలోనూ రెండు సార్లు నోటీసులు

ఆటలోనే కాదు మాటలోనూ దూకుడు చూపించే మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. పంజాబ్ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సిద్ధూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఓ సభలో సిద్ధూ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయగా, బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అనిల్ అంబానీకి మేలు చేసేందుకే రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్నారని, మోదీ అవినీతిపరుడని సిద్ధూ విమర్శలు చేశారు. అమరజవాన్ల పేరుమీద కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ మోదీపై ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ సిద్ధూకు నోటీసులు పంపింది.

సిద్ధూకు ఈసీ నోటీసులు ఇవ్వడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ రెండు సార్లు ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యాడీ పంజాబ్ మంత్రి. అంతేకాదు, ముస్లిం సోదరులు కాంగ్రెస్ కే ఓటేయాలని కోరడంతో ఈసీ ఆయన్ను మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నుంచి నిషేధం విధించింది.

  • Loading...

More Telugu News