Congress: హెలికాప్టర్ డోర్ ను రిపేర్ చేయడంలో పైలట్ కి సాయం చేసిన రాహుల్ గాంధీ!

  • హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో ఘటన
  • హెలికాప్టర్ డోర్ లో తలెత్తిన సాంకేతిక సమస్య
  • సంబంధిత ఫొటో వైరల్ 

సార్వత్రిక ఎన్నికల్లో మరో రెండు విడతల పోలింగ్ మాత్రమే మిగిలిఉండటంతో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దేశమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో హెలికాప్టర్ డోర్ ను రిపేర్ చేయడంలో పైలట్ కి సహకరిస్తూ రాహుల్ నేలపై పడుకుని ఉన్నట్టు కనిపిస్తున్నారు. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో పర్యటించారు.

ఈ సందర్భంగా హెలికాప్టర్ డోర్ విషయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ కి సహాయకారిగా రాహుల్ కూడా రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మంచి టీం వర్క్‌ అంటే అన్ని చేతులు కలిసి పనిచేయడమే. ఉనా పర్యటన సమయంలో మా హెలికాప్టర్‌లో సమస్య ఎదురైంది. మేమంతా కలిసి దాన్ని త్వరగా సరిచేశాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు’ అని రాహుల్ తెలిపారు.  టీం వర్క్‌తో ఏదైనా సాధించగలమని వ్యాఖ్యానించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News