Andhra Pradesh: సెలవుపై వెళ్లిపోయిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది!

  • నేటి నుంచి 16 వరకూ సెలవు
  • వ్యక్తిగత కారణాలతో వెళుతున్నట్లు సమాచారం
  • కేబినెట్ అజెండా ఆలస్యమయ్యే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళ్లిపోయారు. ఈ నెల 11 నుంచి 15 వరకూ ఆయన వ్యక్తిగత కారణాల రీత్యా సెలవుపై వెళుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఏపీ కేబినెట్ భేటీ ఈనెల 14న జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి సెలవుపై వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

కాగా, సెలవుపై వెళ్లిన  గోపాలకృష్ణ  ద్వివేది ఈ నెల 16న సచివాలయానికి వస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ద్వివేది సెలవు కారణంగా కేబినెట్ అజెండా మరింత ఆలస్యమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Andhra Pradesh
cabnet meeting
ceo
gopla krishna dwivedi
on leave
  • Loading...

More Telugu News