sai dharam tej: మెగా హీరోకి తండ్రిగా మంచి రావు రమేశ్

  • సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి సినిమా
  •  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ
  •  త్వరలోనే లాంచ్ చేసే దిశగా పనులు

తెలుగులో ప్రకాశ్ రాజ్ తరువాత ఆ తరహా పాత్రలను ఆ స్థాయిలో పండించగల నటుడిగా రావు రమేశ్ కి మంచి గుర్తింపు వుంది. తనదైన డైలాగ్ డెలివరీతో .. సహజమైన నటనతో ఆకట్టుకోవడం రావు రమేశ్ ప్రత్యేకత. అలాంటి రావు రమేశ్ మరో విభిన్నమైన పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనేది తాజా సమాచారం.

సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందనుంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తండ్రి పాత్ర చాలా కీలకంగా నిలుస్తుందట. అందువలన ఈ పాత్ర కోసం రావు రమేశ్ ను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ కథానాయికను కూడా ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని అంటున్నారు. 

sai dharam tej
rao ramesh
  • Loading...

More Telugu News