namrata sirodkar: కొంచెం మేకప్ వేసుకో అన్న నెటిజన్ కు ఘాటుగా సమాధానమిచ్చిన మహేశ్ బాబు భార్య నమ్రత

  • 'మహర్షి' సెలబ్రేషన్స్ ఫొటోను షేర్ చేసిన నమ్రత
  • డిప్రెషన్ లో ఉన్నావా అని ప్రశ్నించిన నెటిజన్
  • ఈ పేజ్ నుంచి వెళ్లిపో అని సలహా ఇచ్చిన నమ్రత

తన భర్త మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమా విజయం సాధించడంతో నమ్రత శిరోద్కర్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. తన కుటుంబం, కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ తో కలసి ఆమె సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆమె పంచుకున్నారు. అయితే, ఒక నెటిజన్ నుంచి ఆమెకు ఊహించని స్పందన ఎదురైంది.

'నమ్రత, మీరు కొంచెం మేకప్ వేసుకోవచ్చు కదా. డిప్రెషన్ తో బాధపడుతున్నారా?' అని గౌరవ్ శర్మ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలకు నమ్రత అదే స్థాయిలో సమాధానమిచ్చారు. 'గౌరవ్.. నీకు మేకప్ వేసుకునే మహిళలంటేనే ఇష్టమనుకుంటా. ఎప్పుడూ మేకప్, సూట్ ఉండే వాళ్లనే నీవు ఫాలో కావడం మంచిది. ఈ పేజ్ లో నీకు అది దొరకదు. కాబట్టీ నీవు ఈ పేజ్ నుంచి వెళ్లిపోవడం మంచిది. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్' అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.

namrata sirodkar
mahesh babu
make up
tollywood
  • Loading...

More Telugu News