Russia: ఐస్ హాకీ గేమ్ లో అపశ్రుతి.. ఒక్కసారిగా పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్!

  • రష్యాలోని సోచిలో ఘటన
  • ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ప్రజలకు అభివాదం
  • ఏకంగా 8 గోల్స్ కొట్టిన పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిగతా రాజకీయ నేతలకు భిన్నమైన వ్యక్తి. 2000 నుంచి రష్యాను పాలిస్తున్న పుతిన్ గతంలో రష్యన్ నిఘా సంస్థ కేజీబీకి అధినేతగా వ్యహరించారు. ఈయనకు జూడోలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. ఎప్పుడూ అధికారిక విధుల్లో బిజీగా ఉండే పుతిన్ అప్పుడప్పుడూ ప్రజల ముందుకు వస్తుంటారు. తాజాగా రష్యాలోని సోచీలో జరిగిన ఐస్ హాకీ ఎగ్జిబిషన్ గేమ్ లో పుతిన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభికులకు అభివాదం చేస్తూ వేగంగా వెళుతున్న పుతిన్ ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న సిబ్బంది పుతిన్ ను పైకిలేపారు. నవ్వుతూ పైకిలేచిన పుతిన్ ఏమీ జరగనట్లు ప్రేక్షకులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అన్నట్లు ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పుతిన్ 8 గోల్స్ కొట్టినట్లు రష్యా మీడియా తెలిపింది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచారు? అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.

Russia
PUTIN
ICE HOCKEY
FELLDOWN
  • Error fetching data: Network response was not ok

More Telugu News