Andhra Pradesh: నేడు కర్నూలులో పర్యటించనున్న పవన్ కల్యాణ్!

  • ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్
  • మధ్యాహ్నం 2 గంటల తర్వాత కర్నూలుకు రాక
  • ప్రకటించిన జనసేన పార్టీ వర్గాలు

జనసేన నేత, నంద్యాల లోక్ సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఎస్పీవై రెడ్డి ఈ నెల 1న తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కర్నూలుకు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

పవన్ కల్యాణ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలుకు చేరుకుని ఎస్పీవై రెడ్డికి నివాళులు అర్పిస్తారనీ, అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నాయి. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

1950 జూన్ 4న కడప జిల్లాలో జన్మించిన ఎస్పీవై రెడ్డి పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశారు. ఆయన నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ను స్థాపించారు. 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ సభ్యుడిగా విజయదుందుభి మోగించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Andhra Pradesh
Jana Sena
spy reddy
Pawan Kalyan
Kurnool District
  • Loading...

More Telugu News