Fire Accident: దగ్ధమైన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

  • ఘటన సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు
  • ప్రమాదం ఊహించి దించేసిన బస్సు సిబ్బంది
  • కర్ణాటకలోని తుమకూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఘటన

నలభై మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులంతా మంచి నిద్రలో ఉండగా తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు సిబ్బంది అప్రమత్తత వల్ల అదృష్టవశాత్తు ప్రయాణికులు తప్పించుకోగలిగారు.

 వివరాల్లోకి వెళితే...కర్ణాటకలోని తుమకూరు నుంచి బెంగళూరుకు 40 మంది ప్రయాణికులతో ఈ బస్సు బయలు దేరింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో కాసేపటికి బస్సులో మంటలు మొదలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన బస్సు సిబ్బంది డ్రైవర్‌కు చెప్పి బస్సు నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులందరినీ దించేశారు. ఇది జరిగిన కాసేపటికి బస్సు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమయింది. ఇంత ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Fire Accident
Karnataka
tumakur
travel bus
  • Loading...

More Telugu News