Bandaru Dattatreya: కేసీఆర్ లాంటి వ్యక్తిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు: దత్తాత్రేయ

  • కేసీఆర్ గోడ మీద పిల్లి
  • ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యం
  • ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీ, కాంగ్రెస్‌కే

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటనేది అసాధ్యమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. నేడు ఢిల్లీలో జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి వారిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఆయన గోడ మీద పిల్లిలాంటి వారని విమర్శించారు.

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ లేదా బీజేపీకి మద్దతిస్తున్నాయని, ఇలాంటి సమయంలో కేసీఆర్ యోచిస్తున్న బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు అసాధ్యమన్నారు. కేసీఆర్ ఒక అవకాశ వాదని, ఆయనను ఎవరూ నమ్మరన్నారు.

Bandaru Dattatreya
Delhi
KCR
Federal Front
Congress
BJP
  • Loading...

More Telugu News