Telangana: తెలంగాణలో ఎక్కడా విద్యుత్ సమస్య లేదు: ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు

  • ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చిన కథనం అవాస్తవం 
  • తప్పుడు కథనాలకు ప్రజలు ఆందోళన చెందొద్దు
  • విద్యుత్ సంస్థల్లో కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు

తెలంగాణలో ఎక్కడా విద్యుత్ సమస్య లేదని ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉందంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని అన్నారు. తప్పుడు కథనాలకు ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ హకారాలు అందిస్తోందని అన్నారు. విద్యుత్ సంస్థల్లో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, రాష్ట్రం మొత్తం నాణ్యమైన 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, విద్యుత్ ఉత్పత్తి 11 వేల మెగావాట్లు ఉందని వివరించారు.

Telangana
transco
zenco
cmd
samba siva rao
  • Loading...

More Telugu News