Aravind Kejriwal: వాళ్లిద్దర్నీ నిలువరించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమే: కేజ్రీవాల్

  • ఏ పార్టీకైనా మద్దతిచ్చేందుకు సిద్ధం
  • అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టిన కేజ్రీ
  • రాజధాని నుంచి తరిమికొట్టేలా ఉన్నారని ఎద్దేవా

బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ సహా ఏ పార్టీకైనా మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టో సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ-షా ద్వయాన్ని అధికారంలోకి రానీయకుండా నిలువరించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమన్నారు.

అమిత్ షా గతంలో ఢిల్లీలోకి చొరబాటు దారులను ఉపేక్షించబోనంటూ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తప్పుబట్టారు. అమిత్ షా మాటలను బట్టి చూస్తే మూడు మతాల ప్రజలను తప్పించి, మిగతావారిని రాజధాని నుంచి తరిమికొట్టే ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించగలిగే పార్టీకే తాము తొలి ప్రాధాన్యమిస్తామన్నారు.

Aravind Kejriwal
Narendra Modi
Amith Shah
BJP
Delhi
  • Loading...

More Telugu News