Narendra Modi: ప్రపంచ ప్రఖ్యాత 'టైమ్' మ్యాగజైన్ కవర్ పేజీపై మోదీ ఫొటో

  • తాజా సంచికలో మోదీపై కథనాలు
  • వ్యాసాలు రాసిన ఆతిష్ తసీర్, బ్రెమర్
  • విమర్శనాత్మకంగా తసీర్ కథనం!

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టైమ్ మ్యాగజైన్ తన తాజా సంచిక కవర్ పేజీపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ప్రచురించింది. భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తరుణంలో టైమ్ మ్యాగజైన్ మోదీపై కథనాలు ప్రచురించింది. వాటిలో ఒకటి 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' అనే పేరుతో కాస్తంత వివాదాస్పద ఛాయల్లో ఉండగా, మరొకటి 'మోదీ ది రిఫార్మర్' పేరుతో సానుకూలంగా కనిపిస్తోంది.

'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' అనే వ్యాసాన్ని ప్రముఖ భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ తనయుడు ఆతిష్ తసీర్ రచించగా, 'మోదీ ది రిఫార్మర్' కథనాన్ని యూరేషియా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇయాన్ బ్రెమర్ రాశారు. ఆతిష్ తశీర్ తన విమర్శనాత్మక వ్యాసంలో, బలహీన ప్రతిపక్షం ఉండడం మోదీకి కలిసొచ్చిందని పేర్కొన్నారు.

అయితే 2015లో కూడా మోదీ ముఖచిత్రంతో టైమ్ మ్యాగజైన్ ఓ సంచిక వెలువరించగా, అందులో మోదీ ఎందుకు విలువైన వ్యక్తి అయ్యారో చెబుతూ పాజిటివ్ గా రాశారు. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా మోదీపై విమర్శనాత్మక ధోరణిలో కథనం సాగినట్టు 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' వ్యాసం శీర్షికే చెబుతోంది.

  • Loading...

More Telugu News